| కవితలు | దాశరథి కవితలు | రుద్రవీణ |
| 12. రానున్నది | |
|
రానున్నది యేది నిజం? అది ఒకటే, సోషలిజం. | |
|
కలపండోయ్ బుజం బుజం కదలండోయ్ గజం గజం. | |
|
అడుగడుగున యెడద నెత్రు మడుగులుగా విడవండోయ్. | |
|
పడిపోయిన గుడి గోడలు విడిచి పెట్టి నడవండోయ్. | |
|
ఉదయాకాశ పతాకం యెదలో కదలాడె నేడు. | |
|
హృదయావేశ తటాకం నదిలా పొరలాడె నేడు. | |
|
రానున్నది యేది నిజం? అది ఒకటే, సోషలిజం. | |