కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
ఢంకా బజావ్‌!
ఢంకా బజావ్‌!
(ఢంకా - ఫిబ్రవరి 1945)
సమరాహ్వానము
నినదించే
రణభేరీ
నాలుకపై
రక్తరాపము
అరుణరాగ
తరుణ సంధ్య
    *
కాలప్రవాహ వేళను
చప్పుడు లేకే జను
కప్పదాట్లు
గంటలు
చీకటి కళ్ళు విప్పి
చుక్కలు
కాలపాంధుని
కళ్ళకు
ముళ్ళబాధ
అంతలో
నటరాజు గొంతులో
పాటలా
పుష్పించి
పురివిచ్చె
పుష్కలావర్త మేఘాలు
ఏ నీల పాళికల
పదును పెడుతున్నారొ
ఉసురు తీసేటి
అసురుల చేతికత్తి
పశ్చిమా కాశాన
విరిసె విద్యుల్లతలు
నర్తించె
నాడికాబర్హి
కళవళ పడదె
కాలాహి నేడు
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - DhaMkA bajAv.h! - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )