కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
గేదెపెయ్య
గేదెపెయ్య
(ఆనందవాణి - మార్చి 26, 1944)
మేడమీద నేను
మేడకింద
పాకలోన నీవు
చైతన్య స్రవంతిలోన
మేడమీద
మేడకింద
నీతో నేను
వ్యక్తంలో
నీ నోటిని గడ్డిపరక
వ్యక్తా వ్యక్తంలో
నా గీతం
కుక్షింభరత్వము నీది
దక్షయజ్ఞం నా బ్రతుకు
రాక్షసివై సుఖపడు నీవు
యక్షుడనై విలపించెద నేను
నీ సజీవ 'అంభా' రవమునకే
చెవులు మూసుకొని
నా నిర్జీవపు గీతాలను
వినేందుకు
సభ చేసిన లోకం
సెభాస్‌!!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - gEdepeyya - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )