కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
నీ వెవరే!
నీ వెవరే!
(భారతి - మే 1943)
పాడె రేడియో!
నా చేతిని గడియారం
కనిపించని
కాలం గుఱ్ఱం
డెక్కల చప్పుడు
'టిక్కు! టిక్కు!'
దరిద్రంతో
తాపత్రయాలతో
వెంటాడిన
వెఱ్ఱికుక్క
దినానికి
తిలోదకాలు!
హాయిగా
అర్ధరాత్రి
ఆడామగా
తడిమినా తెలియని
తాండ్ర పాపారాయడు
తమస్సు!
బుద్ధి హృదయం
ధ్యానబుద్ధులై
నిమీలిత నేత్రాలతో
నిద్రిస్తే
వ్యక్తా వ్యక్తలోకంలోంచి
వెలుగు బాటలు
చూపించే
నీవెవరే!
(వ్యక్తావ్యక్తం = Subconscious)
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - nI vevarE! - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )