కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
వెన్నెల లోతుల్లో
వెన్నెల లోతుల్లో
(భారతి - అక్టోబరు 1947)
కుష్ఠురోగి
వొంటిమీద కప్పుకొనే
కనలిన రక్తపుగుడ్డ
నలుపెక్కిన
ఎఱ్ఱని సంధ్యాశకలం
బయట
తీర్థప్రజ కోలాహలం
నిశలో వెన్నెల
నిత్య పునిస్త్రీ
శూన్యం
పాదాల
చూపుడు వ్రేలు
రోదసి
'ఘల్లు! ఘల్లు!'
మట్టెల ధ్వని వెన్నెల
మగనిశాపం
పెరవానితో
లేచిపోయిన
పైదలి
గాలికి రోదించే
చెట్టుకొమ్మ
శ్మశానంలో
చంటిపిల్ల డేడుపులా
బ్రహ్మచెముడు కంచెమీద
పుష్పవికసనం
కునిష్ఠి
ఉన్మత్తుడు
క్షయాపాతకుడు
చంద్రుని వరించి
తీతుక
తుమ్మచెట్టుమీంచి
'తీ'యని 'తీ'యని
ప్రేమగీతి
వినిపిస్తే
రోగంతో
బాధపడు నేను
యముని కోర్టునుంచి
సమనని భయపడితే
గదిలోపల
మేడమీద
లోకంలో
మంచితప్ప
చెడ్డలేదు
నమ్మననే
చంటిపిల్లడు
అప్పలస్వామి
ఆంగ్లంలో
అద్భుతమైన కవి
ఫ్రెంచిలో
పండితుడు
పాడుపాట
లలూన్‌ [1]
నెగర్ద్‌
ఓఁకూన్‌
రఁకూన్‌

[1] ఫ్రెంచ్‌ అర్థం: చంద్రునివల్ల ఎప్పుడును చెడుపు సంభవించదు.

AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - vennela lOtullO - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )