కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
విశాఖపట్నం
విశాఖపట్నం
(భారతి - 1940)
ఆయుధ పూజలేని
దసరాకు పద్యాలెందుకో
ఆనందంలేని
సరదాకు అందుకే
    *    *
విశాఖపట్నం
విశాఖపట్నం
జోడులేక
పోకూడదు
నీగ్రోస్త్రీ బుగ్గల్లాగ
నిగనిగ లాడే తారురోడ్లు
తప్పుకో
తప్పుకో
దారిలేకపోయినా
కారు మట్టేస్తుంది
ఇక్కడ
స్వర్గం నరకం
సురభిళించి
కంపు కొడతాయి
ఇక్కడ
చావు బ్రదుకు
అత్తాకోడళ్ళలా
అభిమానించుకుంటూ
కాట్లాడుతాయ్‌
పడిపోయిన కొంపల్లో
పాతివ్రత్యం
మురికిగుడ్డల్లో కంపుకొట్టి
పలవిస్తే
రంకు సెంటు వాసనతో
రైంయని
కారులో షి
కారు చేస్తుంది.
ఇక్కడ
సోడాలో కాక్‌టైల్‌
కిల్లీలో ఉల్లి పాషాణం
సిరాబుడ్డిలో ఆత్మహత్య
విమానంలో భ్రూణహత్య
పెట్టెబండిలో గర్భస్రావం
సూటులో సుడిగుండం
టార్చిలైటులో కొరవిదయ్యం
రోగంలో శృంగారం
రేడియోలో సింహగర్జన
మనీపర్సులో దొంగలు
చల్లగా మెల్లగా హాయిగా
ఆడుదాని కౌగిలిలా రాత్రులు
లెంపకాయ కొట్టినట్టు పగళ్ళు
అభిమన్యుడు ప్రవేశించలేని
కొలంబస్సయినా కనుక్కోలేని
దోసెడంత సందుల్లో
గోదావరంత కుళ్ళు కాలవలు
క్లబ్బెందుకు గుడికాదు?
కాఫీ ఎల్లమ్మ గ్రామదేవత
ప్రొద్దున్న
మధ్యాహ్నం
బోలెడంత సంబరం
తోచడు
ఆకాశంపై
చండకరుడు
ఉదయాన
కాఫీక్లబ్బులో
దోసె తింటేనేకాని
సాయంత్రం
చందమామ
సినిమా చూశాకా
వెన్నెల కాస్తాడు.
మేడలపై
మెడికల్‌ కుర్రాళ్ళు
ఎముకలతో
వలపు జాబు
లిఖిస్తారు
రోడ్డుదరిని
కొళాయిదగ్గర
బిందెల దొంతులె
గోవర్ధన పర్వతాలు
తల్లులు
పాలీయని
పిల్లలె
తాండవ కృష్ణులు
త్రాగేందుకు నీరు లేకపోయినా
డయాబిటిస్‌కు లోటులేదు
పిలవకుండా
పలికే ముండలకు
పిలిస్తే పలికే జబ్బులు
భోగం వాళ్ళిళ్ళల్లో
భోగించిన
దేవేంద్రులు
శాపవిమోచనం కొరకు
చేరుకుంద్రు ఆసుపత్రి
సహస్రకోటి జబ్బులకు
అనంతకోటి డాక్టర్లు
మందులకోసం
మానవులు
ప్రాణానికి కాదు
రోగానికి
ప్రాముఖ్యం
ఆసుపత్రి కెళితే
అస్ఖలిత బ్రహ్మచారికైనా
ఆడుదాని చేయి
తగలక మానదు
సకల రోగ నివారిణి
సాని
దొరసాని
నరసమ్మ!
ఓ! అంతా
లేడీ స్టూడెంట్లే
ఊరంతా ఒకయిల్లు
సమర్తగది స్కూలు
పురిటిగది ఆసుపత్రి
గాలి వీస్తే
గర్భవతులగు
అనాధలు
ధూళికే విడిచే
సంతానం
ప్రేమకు ప్రాణాలిచ్చే
స్త్రీలు
ఉరికొయ్యల్లాంటి
మగాళ్ళు
అల్లదె ప్లీడర్ల వాస
ఋగ్వేదం న్యాయవాదం
బోగం దానింటికెళ్ళి
బాగుపడినవా డుండొచ్చు
లాయర్ల యింటికొచ్చి
లాభం పొందినవాడు సున్న
గుమస్తాలంతా
గుల్లగాళ్ళు
బీదవాళ్ల నెత్తురు
బీరులాగ తాగేస్తారు
ధర్మాన్ని పశువునిచేసి
పట్టపగలు
కోర్టులోన
వధచేసి
సాయంత్రం
సురాపానంలో
చప్పరించి
నంచుకుంద్రు
కలకత్తా కాళినైనా
కోర్టుకు రప్పించగలరు
కర్మసాక్షిచేత
దొంగసాక్ష్య మిప్పిస్తారు
పగలుకాదు ఆకాశానికి పుండు
ఆపరేషన్‌ అవసరం
ప్రకృతికి ఎక్స్‌రే వెయ్యాలని
ప్రమాణంచేసే
ఎక్‌స్పర్టులు
శాపం కామోసు
నార్టన్‌కైనా
చచ్చాక
పెళ్ళానికి
పిల్లలికి
చిల్లిగవ్వ ఉండదు
దొరసానిలాంటి
విశాఖపట్నానికి
వాల్తేరు వక్షోజం
ధనవంతుల ధనుష్కోటి
    *    *
ఆంధ్రా సినిటోన్‌
ఆంధ్రా సినిటోన్‌
ఆడ మగాళ్ళన్నట్టు
ఆక్టర్‌ డైరక్టర్లు
అరవ సహాయం దైవసహాయం
తెనుగుల పాత్రధారణం
మూగ మ్యూజిక్‌ డైరక్టర్లు
ఫిలిమొక పంచభాషి
    *    *
ఆంధ్రుల విశ్వవిద్యాలయం
ఓఢ్రుల సహాయం
అరవ పండితులు
మార్కులొస్తే
మహా మహోపాధ్యాయ
రాకపోతే
రాలుగాయ
    *    *
ఆఫీసులు ఆశ్రమాలు
ఆఫీసర్లే ఋషులు
లంచంకోసం తపస్సు
అచ్చర కన్నెలు
రూపాయలు
    *     *
ప్రజల పాపం హార్బరు చేసేందుకే
హార్బరు
ధర్మామీటర్లలాంటి
కొయ్యలతో
ఎనీమా డొక్కుల్లాంటి
స్టీమర్లు
నగ్నంగా స్త్రీ
స్నానం చేసేటప్పుడు
ఎదురుగుండా పరాయి మొగాడు
ఏరాడకొండ
ఆలీబాబా
అబ్ధి-
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - viSAkhapaTnaM - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )