శతకములు చెన్నమల్లు సీసములు
1 14 19 22 26 31 36
ప్రసాది స్థలము
కాయంబు నింద్రియోత్కరమును నర్పించి - సంధిల్లు కాయప్రసాది యేని
ప్రాణంబు సత్క్రియాపదమును నర్పించి - సాధించు ప్రాణప్రసాది యేని
శబ్దంబుఁ దచ్ఛబ్దసౌఖ్యంబు నర్పించి - శబ్దించు వచనప్రసాది యేని
గమనంబు గమనసంగతియును నర్పించి - చననేర్చు గమనప్రసాది యేని
 
తలఁపులను జేష్టలను నర్పితంబుఁ జేసి - సంచరించు వ్యాపారప్రసాది యేని
అట్టి సర్వసంపూర్ణ మహాప్రసాద - సన్నిహితులను జేర్పుమీ చెన్నమల్లు.
19
తఱి తఱి దలఁచుచో మఱలి యైనను బ్రబు - ద్ధతఁ బ్రసాదమె గాని తలఁపఁడేని
గడగడ వణఁకుచోఁ దడఁబడియైనఁ జొ - ప్పడఁ బ్రసాదమెగాని పలుకఁడేని
గ్రక్కునఁ బొందుచోఁ గలలోననైన ని - మ్ములఁ బ్రసాదమెగాని ముట్టఁడేని
సరినేఁగుచోఁ గాలుజాఱియైనను లెస్స - మీప్రసాదమెగాని మెట్టఁడేని
 
సొలసి యింద్రియముల సోగియించుచోఁ బ్రాణ - మరుగునప్పు డైన నవికలత్వ
సావధానియైన యాప్రసాదినిఁ గూడఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
20
సన్మనోభావంబు సంధిల్లు టరిదియే - తగిలి ప్రసాదమై తలఁపు లడర
భక్తిసుభాషల భాసిల్లు టరిదియే - కలయఁ బ్రసాదమై పలుకు లడర
విమలభక్త క్రియాంగము చెల్లు టరిదియె - వఱలు ప్రసాదమై వ్యాప్తి దనర
చిరారాంతశ్శుద్ధి దొరకొను టరిదియే - గూఢప్రసాదమై కోర్కు లడర
 
నింద్రియముల గెల్చుటె ట్లరిదియే సమ - స్తాంగములు ప్రసాదమై చెలంగ
నట్లుగాన నీమహాప్రసాదానూన - సిద్ధి కేవలంబె చెన్నమల్లు.
21
AndhraBharati AMdhra bhArati - shatakamulu - chennamallu sIsamulu shatakamu - pAlakuriki sOmanAtha ( telugu andhra )