శతకములు ధూర్తమానవా శతకము
 1 11 21 31
ఇతరులఁ బర్వుతో బ్రదుక-నిచ్చుట నెన్నఁడు నేర్చికొందు వా
యతమగు నీ ప్రపంచసుఖ-మన్నది యొక్కటె నీ సుఖంబుగాఁ
బ్రతిదినమున్‌ స్మరించు సమ-భావము నెన్నఁడు నేర్చికొందు వు
న్నతిఁ గనుచుండి నీ ప్రజ ల-నారతమున్‌ నినుమెచ్చ మానవా!
31
చేసినవేమో చేసితివి-చెన్నటివై; యని నేను సైరణన్‌
జేసితి; నింకముందయినఁ-జేసిన తప్పుల దిద్దుబాటుకై
గాసిలియైన యత్నములు-గట్టిగఁ జేయక యూరకున్నచో
వేసరఁబోక కట్టి కుడి-పించెదఁ దప్పదు ధూర్తమానవా!
32
నే వచ్చి నీకుఁ గలలో
వావిరి చెప్పినది యెల్ల వ్రాయుటచేతన్‌
నీవే ధన్యుఁడ వైతివి
రావోయీ! త్రిపురనేని రామస్వామీ!
33
పైగా నాతనినే విమానముపయిన్‌-స్వర్గంబు గొంపోయి త
ద్భోగావాప్తిని గూర్చినాఁడ నని సు-ద్దుల్‌ చెప్పుచున్నాఁడవా?
జాగీరిచ్చునె యే ప్రభుండయిన రా-జద్రోహికిన్‌ స్వర్గమా?
నీ గాండ్రింపులు గట్టిపెట్ట నిఁకనే-నిన్‌ బూనవా? మానవా!
34
ఎడ్డెతనంబుఁ జూపెదవె!-యెంతని నే సహియింతు నిన్ను; నీ
కడ్డము వచ్చినంతటనె-యాతఁడు ధర్మవిదూరుడౌనె? పెన్‌
గడ్డము లేకయున్న నెటు-కాఁగలడయ్య ఋషీంద్రుఁ డెందు! నీ
నడ్డి విఱుంగు నింకపయి-నన్‌ మతిదప్పిన ధూర్తమానవా!
35
ఆ యాచార్యుఁ డెవఁడో తెల్పవుగ య-త్యాచారముం జల్పుచున్‌
కాయంబెల్లను రాజయక్ష్మయను రో-గంబందుటన్‌ గ్రుళ్ళి వే
యాయాసంబునఁ దూలుచున్నతఁడు నా-యాచార్యులం దొక్కఁడా?
నాయాజ్ఞా పరిపాలురం దొకఁడ! నన్‌-వంచింతువా? మానవా!
36
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dhUrtamAnavA shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )