బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ఈశ్వరుడు

ఈశ్వరుడు

లోకమ్ము వారికీ రొండు కన్నుల్లు;
లోకరక్షక, నీకు వేయికన్నుల్లు!

ఇద్దరుపెండ్లాలు, ఈశ్వరుడ నీకు;
పలువరుస చక్కనిది పార్వతీదేవి!

కన్నుల్లు చక్కన్న కనకదుర్గకును,
ఇద్దరుపెండ్లాము లేలయ్య నీకు?

ఎద్దెక్కి తిరిగేవు ఈశ్వరుడ నీవు,
బిచ్చమెత్తిందాక బిడ్డలకు లేదు!
అడిగి తెచ్చిందాక ఆలికే లేదు!!

AndhraBharati AMdhra bhArati - ISvaruDu - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )