బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కాకమ్మ

కాకమ్మ

కాకమ్మా! కాకమ్మా!!
చుట్టాలొ చ్చారు చూచిపో,
పక్కాలొ చ్చారు పారిపో,
నీ కాలికి గజ్జకడతా,
కాలుతీసి ఖంగున గంతెయ్‌!

* * *

చందమామ బొట్టు
నా సందిటికేసికట్టు,
ఊళ్లోవుంటే ఒట్టు
నీవు వచ్చిన దారినిబట్టు.
AndhraBharati AMdhra bhArati - kAkamma - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )