| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | చక్కిలిగింతలు |

(పసిబిడ్డలను పెద్దవారు దగ్గర కూర్చుండబెట్టుకొని అరచెయ్యి పట్టుకొని ఈ క్రింది పదము చెప్పుతూ ఆయా పనులు చేస్తున్నట్టు అభినయస్తూ చివరకు బిడ్డ చంకలో చక్కలిగింత పెట్టుతారు. బిడ్డ నవ్వుతుంది.)
| చక్కిలిగింతలు | ||
|
పప్పుపెట్టి, పాయసంపెట్టి, అన్నంపెట్టి, అప్పచ్చిపెట్టి, కూరపెట్టి, ఊరుగాయపెట్టి, నెయ్యివేసి, ముద్దచేసి, తినిపించి, తినిపించి, చెయిగడిగి, మూతిగడిగి, తాతగారింటికి దారేదంటే, (అత్తవారింటికి దారేదంటే,) ఇట్లాపోయి, ఇట్లాపోయి, మోచేతిపాలెం ముందర్నించి, ఇట్లాపోయి, ఇట్లాపోయి, ఇదిగో ఇదిగో, వచ్చాంవచ్చాం, చక్కావచ్చాం, చక్కావచ్చాం, చక్కిలిగిలిగిలి, చక్కిలిగిలిగిలి! | ||