బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి తప్పుటడుగులు

తప్పుటడుగులు
(ఏనుగు లక్ష్మణకవి పెద్దాపురపు రాజకుమారునిమీద చెప్పిన పాట.)

పల్లవి:
అప్పా రావోయీ! ఒప్పుల కుప్పా రావోయీ!
తప్పూ టడుగూ లిడుచూనూ మా తండ్రీ రావోయీ!

అనుపల్లవి:
అంగీలోపలా నీ బొజ్జా, ఆకలి గొన్నాదీ
బంగారూ నా తండ్రీ నీకూ, పాలూ పోసేనూ
రంగూగా నే నెంతా పిలిచిన, రాకా జుణిగేవూ!
బుంగా పట్టూకోనీ పెద్దా, బూచీ వచ్చేనూ!
లాలా పోసూకో బాబయ్యా, చాలా ప్రొద్దాయే;
తాలీ మీతో నీకూ వెనక, దాదూ వుంచేనూ!
పాలూ బువ్వా తిని తొట్టేలో, పవ్వాళించితే
లాలీ పాటాలాతో నిన్నూ, జోలా పాడేనూ!
సరిపేషూ గట్టీ నిండూ ము, స్తాబూ చేసేను;
అరుదూగా నీ చమరూ లోకీ, ఆడూకో బొమ్మీ!
ఉరువైనా నీ సొగసూ చూచీ, ఉప్పాతించేరు;
తిరుగాబోకు మీ స్వారీలో, దృష్టీ తాకేనీ!

అప్పా రావోయీ! ఒప్పులకుప్పా రావోయీ!
తప్పూ టడుగూ లిడుచూనూ మా తండ్రీ రావోయీ!
AndhraBharati AMdhra bhArati - tappuTaDugulu - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )