బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి దొంగవో? దొరవో?

దొంగవో? దొరవో?
పెద్దవారు బిడ్డను ముందు కూర్చుండబెట్టుకొని
'నీవు దొంగవో దొరవో కనుగొందునా' అని అడిగి -

        దొంగవో దొరవో?
        దొంగవో దొరవో?

అంటూ ముడ్డిపూస దగ్గరనుండి ముచ్చిలిగుంట దాకా
వెన్నెముకను అలాకనగా తాకుతారు. దాని చేత బిడ్డకు
చక్కిలిగిలి యేర్పడుతుంది. కొంత దూరము ఓర్చుకోవచ్చునుగాని,
ముచ్చిలిగుంట చేరువకు రాను రాను చక్కిలిగింతను
నిబ్బరించు కోవడము సాధ్యము కాకపోతుంది. నిబ్బరించుకోలేక
చక్కిలిగింతపడి బిడ్డనవ్వును. నవ్వితే దొంగ, నవ్వకుంటే దొర అని నిర్ణయము.
'నవ్వినావులే' అని చక్కిలిగిలి పెట్టినవారు గేలిచేస్తారు. అందుకని బిడ్డ
చక్కిలిగిలి పడకుండా నిబ్బరించుకునేటందుకు ప్రయత్నించును.
AndhraBharati AMdhra bhArati - doMgavO? doravO? - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )