| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | జడుపు |

జడుపు
(పసిబిడ్డను ముందు కూర్చుండబెట్టుకుని యీ క్రింది పదము చెప్పుతూ చివరకు కళ్లలో "ఉఫ్" అని ఊదితే బిడ్డ కళ్లు మూస్తుంది. "అదుగో జడిసినావులే" అని గేలి చేస్తారు. అందాకా "జడవను, జడవను" అని బదులు చెప్పుతుంది.)
| నూకలు పెడతాను మేకలు గాస్తావు? | కాస్తా! |
| పెద్దపులివస్తే జడవవుగద? | జడవను! |
| చిఱతపులివస్తే జడవవుగద? | జడవను! |
| ఎలుగుబంటివస్తే జడవవుగద? | జడవను! |
| సివంగివస్తే జడవవుగద? | జడవను! |
| తోడేలువస్తే జడవవుగద? | జడవను! |
| అన్నింటికీ "జడవను" అని చెప్పును. | |
| నే వస్తే జడవవు కద? | |
| (ఇది చెప్పి కళ్లలో ఊదవలెను; బిడ్డ కన్నులు మూసుకొనును.) | |
| జడిసినావులే అమ్మా జడిసినావు!! | |