భాష ఛందస్సు సులక్షణసారము
4. వృత్తములు
క. సమవృత్తములఁ జతుష్పా
దములం దొక్క క్షరము మొ - దలుగాఁ బెరుగన్‌
గ్రమముగ గణాక్షరంబులు
సమమౌ మఱి యిరువదాఱు - ఛందంబులకున్‌.
    (భీమన ఛందము)
35
4.1. ఉత్పలమాలావృత్తము
. భానుసమాన! విన్‌, భరన - భారలగంబులఁ గూడి విశ్రమ
స్థానమునందుఁ బద్మజయు - తంబుగ నుత్పలమాలయై చనున్‌.
    (భీమన ఛందము)
36
4.2. చంపకమాలావృత్తము
. నజభజజల్‌ జరేఫలఁ బె - నంగి దిశాయతి తోడఁ గూడినన్‌
ద్రిజగ దభీష్టదా బుధని - ధీ విను చంపకమాలయై చను\న్‌.
    (భీమన ఛందము)
37
4.3. శార్దూల విక్రీడిత వృత్తము
. సారాచార విశారదా! యినయతి\న్‌ - శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతా - గ ప్రాప్తమై చెల్వగు\న్‌.
    (భీమన ఛందము)
38
4.4. మత్తేభ విక్రీడితము
. స్మయదురా! విలసత్ప్రయోదశయతి\న్‌ - మత్తేభ విక్రీడితా
హ్వయమయ్యె\న్‌ సభరంబులు\న్‌ సమయవ - వ్రాతంబులుం గూడఁగా\న్‌
    (భీమన ఛందము)
39
4.5. మత్తకోకిల
. శ్రావకాభరణాంక! వి\న్‌, రస - జాభ రేఫల దిగ్విరా
మావహంబుగ మత్తకోకిల - మండ్రు దీని\న్‌ గవీశ్వరుల్‌
    (భీమన ఛందము)
40
4.6. ధ్రువకోకిల (తరలము)
. శుభవిలాస! ముకుంద! కేశవ! - శూలిభవ్య విరామము\న్‌
న, భ, ర, సంబులు, జాగముల్‌ దగు - నవ్యమై ధ్రువకోకిల\న్‌
41
4.7. పృథ్వి
. త్రయోదశయతి\న్‌ గృతి\న్‌ జ,స,జ,సల్‌,జ - తంబై య, వల్‌
దయాజలనిధీ! చెలంగు విను పృథ్వి - ధాత్రిం దగన్‌.
42
4.8. సరసాంకము
. సరసాంక వృత్త మమరు\న్‌ - స, జ, సా, య లొంద\న్‌
సరసీజ సంభవయతి\న్‌ - జలజాత నేత్రా!
43
4.9. స్రగ్ధర
. శ్రీమన్మూర్తీ మకారా - శ్రిత ర, భ, న, య, యా - సేవ్యమై సానుమద్వి
శ్రామంబు\న్‌ సానుమద్వి - శ్రమము నమరఁగా - స్రగ్ధరావృత్తమయ్యె\న్‌.
    (భీమన ఛందము)
44
4.10. మహాస్రగ్ధర
. లసదుద్యత్కీర్తి వల్లీ - లలిత గుణగణా - లంకృతాంగా స, తా, న
స్థ స, రా, గంబు ల్మహాస్ర - గ్ధరకు వసుముని - స్థానవిశ్రాంతులొప్ప\న్‌.
    (భీమన ఛందము)
45
4.11. స్రగ్విణీ
. వాగ్వధూవల్లభా! - వార్ధి రేఫావళి\న్‌
స్రగ్విణీవృత్త వి - శ్రాంతి యాఱింటిపై.
    (భీమన ఛందము)
46
4.12. భుజంగ ప్రయాతము
. జగద్గీతకీర్తి! భు - జంగ ప్రయాతం
బగు\న్‌ రేచనా! యద్వ - యద్వంద్వమైన\న్‌.
    (భీమన ఛందము)
47
4.13. తోవకము
. శ్రీయుత భత్రయ - సేవ్యగగంబుల్‌
తోయజలోచన! - తోవకమయ్యె\న్‌.
    (భీమన ఛందము)
48
4.14. పాదపము
. పాదపవృత్తము - భా భగగంబుల్‌
మోదముతో నిరు - మూఁటవిరామన్‌.
49
4.15. తోటకము
. తుదిదాఁక సకారచ - తుష్కముగా
విదితంబుగఁ దోటక - వృత్తమగు\న్‌.
    (భీమన ఛందము)
50
4.16. తోదకము
. జలరుహవక్త్ర! న, - జా, యగణంబుల్‌
వెలయగఁ దోదక - వృత్తముఁ జెప్పు\న్‌.
    (భీమన ఛందము)
51
4.17. వసంతతిలకము
. సారంబుగా త, భ, జ, - జంబు వసంతరాజా
కావా! వసంత తిల - కంబగు గాయుతంబై.
    (భీమన ఛందము)
52
4.18. మదన
. దైతేయభంజన! హరీ! - త, భ, జా, గగంబుల్‌
మాతంగ విశ్రమము\న్‌ - మదనాఖ్యయొప్పు\న్‌.
53
4.19. పంచచామరము
. జరల్‌ జరల్‌ జగంబుగూఁడ - సన్నుతి\న్‌ రచింపఁగాఁ
బరాజితారిధీరవీర! - పంచచామరంబగు\న్‌.
54
4.20. సుగంధి
. ఏడుహమ్ములున్గము\న్‌ వ - డెన్మిది\న్‌ సుగంధికి\న్‌.
    (చిత్రకవి పెద్దన)
55
4.21. తరళము
. న, న, న, న, న, న, న, గము లెలమి - నలినహితవిరమణత\న్‌
దనరి తరళ మనఁగ వెలయు - ధరణి మదన మదహరా!
56
4.22. మాలిని
. న, న, మ, య, య యుతంబై - నాగవిశ్రాంతమై యి
ట్లనుపమగుణ! మాలి - న్యాహ్వయంబయ్యెధాత్రిన్‌.
    (భీమన ఛందము)
57
4.23. మానిని
. కారకముల్‌ క్రియ - గన్గొన నేడు భ - కారము లొక్కగ - కారముతో
గారవమై చనఁ - గా వళులన్నియుఁ - గల్గిన మానిని - కామనిభా!
    (భీమన ఛందము)
58
4.24. కవిరాజ విరాజితము
. క్రమమున నొక్క న - కారము నాఱు జ - కారములుం బరఁ - గంగ నకా
రమును నొడంబడి - రాఁ గవిరాజ వి - రాజిత మన్నది - రామనిభా!
    (భీమన ఛందము)
59
4.25. తరలి
. చారు భ, స, న, భూరి జ, న, ర, - సాంద్రగణముల\న్‌ దిశా
సార విరతి నందముగ ని - జంబు తరలి చెన్నగు\న్‌.
60
4.26. శిఖరిణి
. పురారాతి స్పర్ధీ! యమనసభవం - బుల్పెనఁగి సుం
దరంబైన\న్‌ రేచా! శిఖరిణియగు\న్‌ - ద్వాదశయతి\న్‌.
    (భీమన ఛందము)
61
4.27. ఇంద్రవజ్ర
. ఇత్తా, జ, గా సంగతి - నింద్రవజ్రా
వృత్తంబగు\న్‌ సన్నుత - వృత్తరేచా!
    (భీమన ఛందము)
62
4.28. ఉపేంద్రవజ్ర
. సపద్మ పద్మా! జత - జల్గగంబు\న్‌
ఉపేంద్ర వజ్రాఖ్యము - నొప్పుఁజెప్ప\న్‌.
    (భీమన ఛందము)
63
4.29. ఉపజాతి
. ఈ రెండు వృత్తంబులు - నిందుఁగూడ\న్‌
సరోజనేత్రా! యుప - జాతి యయ్యె\న్‌.
    (భీమన ఛందము)
64
4.30. మందాక్రాంత
. కాంతా కాంతా! మభనతతగా - కాంతి సంక్రాంతి మందా
క్రాంతంబయ్యెన్‌ విరతి దశమా - క్రాంతి విశ్రాంతమైనన్‌.
    (భీమన ఛందము)
65
4.31. రథోద్ధత
. నందితప్రయర - నంబుపై రవం
బొంది వచ్చిన ర - థోద్ధతంబగున్‌.
    (భీమన ఛందము)
66
4.32. స్వాగతము
. స్వాగతంబగు ల - సద్గుణ లక్ష్మీ
భాగభోగి! ర, న, - భల్‌, గగయుక్తి\న్‌.
    (భీమన ఛందము)
67
4.33. వంశస్థము
. సముజ్జ్వలాంగా! జ, త, - జంబు, రేఫతో
నమర్పవంశస్థ స - మాహ్వయంబగున్‌.
    (భీమన ఛందము)
68
4.34. ఇంద్రవంశము
. సన్మానధారీ! తత - జంబు రేఫతో
విన్మింద్రవంశాహ్వయ - వృత్తమైచనున్‌.
    (భీమన ఛందము)
69
4.35. మేఘవిస్ఫూర్జితము
. రమానాథు న్నాథు\న్‌ యదుకులశిరో - రమ్యరత్నాయమానున్‌
సముద్యత్తేజిష్ణు\న్‌ దనుజయువతి - స్ఫారధైర్యాపహారు\న్‌
మిముంబ్రీతిం బేర్కొంద్రరుణవిరతిన్‌ - మేఘవిస్ఫూర్జితాఖ్యన్‌
గ్రమ్మంబొప్పన్‌ బెద్దల్‌ యమనసములున్‌ - రాగముల్‌ గా ముకుందా!
    (అనంతుని ఛందము)
70
4.36. భద్రకము
. విద్రుమాభ! రసంబువన్‌
భద్రకంబు ధరిత్రిపై.
71
4.37. మణిరంగ
. శ్రీరసద్వయ - సేవ్యగకారా
ధారమైనది - దా మణిరంగన్‌.
72
4.38. వనమయూరము
. ఉన్నతములై వనమ - యూరకృతులోలిన్‌
ఎన్నఁగ భజంబుల ప - యిన్‌ స, న, గగంబుల్‌
చెన్నొదవ దంతియతి - చెందియలరారన్‌
వెన్నుని నుతింతురు వి - వేకు లతిభక్తిన్‌.
    (అనంతుని ఛందము)
73
4.39. విద్యున్మాల
. ఉద్యన్మాగా - యుక్తంబైనన్‌
విద్యున్మాలా - వృత్తంబయ్యెన్‌.
    (భీమన ఛందము)
74
4.40. ద్రుతవిలంబిత
. ద్రుత విలంబిత - దిష్కరవృత్తమ
ప్రతిమమయ్యె న - భారగణంబులన్‌.
    (భీమన ఛందము)
75
4.41. చంద్రకళ
. శ్రావకాభరణాంక! దిశావి - శ్రామముతోడ ర, సా, తముల్‌
జావిలగ్న, గకారయుతంబై - చంద్రకళాహ్వయమైచనున్‌.
    (భీమన ఛందము)
76
4.42. అంబురుహము
. శ్రీరమణీప్రియ! మల్లియరేచ! వి - శిష్టకల్పమహీజ భా,
భా, ర, స, వంబుల భానువిరామము - వల్కనంబురుహంబగున్‌.
    (భీమన ఛందము)
77
4.43. క్రౌంచపదము
. పంచశరాభా! యంచిత పుణ్యా! - భ,మ,స,భ,న,న,న,య - పరివృతమైనన్‌
క్రౌంచపదాఖ్యం బంచితమయ్యెన్‌ - గ్రమయతి దశవసు - కలితముగాఁగన్‌.
    (భీమన ఛందము)
78
4.44. సాధ్వి
. నారదసనకస - నందనవినుత స - నాథ భ, న, జ, న, స - నా, భగురుల్‌
చారుశిఖరియతి - శైల విరమణము - క్ష్మాధర విరతియు - సాధ్వియగున్‌.
79
4.45. మలయజము
. నళినవిలోచన - నజనసనంబులు - నభనగణంబులు - నటలగమున్‌
మలసి గిరిత్రయ - మహితయతుల్‌ దగి - మలయజవృత్తము - మహి వెలయున్‌.
80
4.46. ప్రభు
. ప్రముదిత గజఋతు - రసవిశ్రమముల్‌ - రమణం గవి వ - ర్యనుతంబునునై
క్రమమున న, న, నలు - రహినైదుజకా - రములును లగమున్‌ - బ్రభువృత్తమగున్‌.
81
4.47. మంగళమహాశ్రీ
. శ్రీమహితలోకహిత - శిష్టజన సేవిత వి - శేషగుణ మంగళ మహాశ్రీ
నామమగు నబ్భజస - నంబులకడన్‌ భజస - నంబులు గగంబులు చెలంగన్‌.
    (భీమన ఛందము)
82
4.48. లయగ్రాహి
. ఇంబలరఁగ భజస - నంబుల తుదన్‌ భజస - నంబులు భకారము నొ - డంబడ లయగ్రా
హింబరఁగ జెప్పఁ గల - శంబిడిన యట్లు యగ - ణంబు కృతిమీఁద నమ - రుం బరహితార్థీ!
    (భీమన ఛందము)
83
4.49. లయవిభాతి
. నసననసనంబులును - నసననసగంబులును
బొసఁగి కృతిపాదములు - రసికముగఁ జెప్పన్‌
గుసుమశరసాయకవ - దసదృశ గుణాభినుత!
రసలయవిభాతియని - రసమసుకవీంద్రుల్‌.
    (భీమన ఛందము)
84
4.50. లయగ్రాహి లయవిభాతులకు యతి నిర్ణయము
. తొమ్మిదింటను దొమ్మిది - తొమ్మిదింట
ధృతి లయగ్రాహికిని బ్రాస - యతులు సెల్లుఁ
బదిటఁ బదిటను బదిటను - బ్రాసయతులు
తగ లయవిభాతికిని జెల్లు - దానవారి!
85
4.51. లాక్షణి
. పక్ష విరమణము భననననములును - భాసుర భననస లెనసినచో
లాక్షణి యనఁదగు నతులిత మదనవి - లాసలలిత గుణగణజలధీ!
86
4.52. రమణకము
. మససిత జనక స - మదరిపు గజహరి - మదగజవసు విర - మణములతో
నననన నననన - నలగము లెనయఁగ - నరవరనుత! రమ - ణక మమరున్‌.
87
4.53. దండకము
. అమరంగ సనహంబు లందాదిగానొండెఁ, గాదేని
నాదిన్‌ తకారంబుగానొండె, లోనం దకారమ్ములిమ్మై గకా
రావసానంబుగాఁ జెప్పినన్‌ దండకంబండ్రు దీనిం గవుల్‌.
88
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - sulakShana sAramu - vishhaya sUchika - liMgamaguMTa timmakavi - sulaxaNa sAramu vellaMki tAtaMbhaTTu andhra telugu tenugu ( telugu andhra )