| శతకములు | దాశరథి శతకము |
|
| చ. |
తరువులు పూచి కాయలగు దత్కుసుమంబులు పూజగా భవ చ్చరణము సోఁకి దాసులకు సారములౌ ధనధాన్యరాసులై కరిభట ఘోటకాంబర నికాయములై విరజానదీసము త్తరణ మొనర్చుఁజిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ! |
101 |
| ఉ. |
పట్టితి భట్టరార్యగురు పాదములిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్ వెట్టితి మంత్రరాజ మొడబెట్టితి నయ్యమకింకరాళికిం గట్టితి బొమ్మ మీ చరణ కంజములందుఁ దలంపుపెట్టి బో దట్టితిఁ బాపపుంజముల దాశరథీ! కరుణాపయోనిధీ! |
102 |
| ఉ. |
అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజ గోత్రజుఁడాదిశాఖ కం చెర్లకులోద్భవుండనఁ బ్రసిద్ధుఁడనై భవదంకితంబుగా నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుఁడన్ జగ ద్వల్లభ నీకు దాసుఁడను దాశరథీ! కరుణాపయోనిధీ! |
103 |