| శతకములు | గువ్వలచెన్న శతకము |
|
| క. |
కలకొలఁది ధర్మముండినఁ గలిగినసిరి కదలకుండుఁ గాసారమునన్ గలజలము మడువులేమిని గొలగొల గట్టు తెగిపోదె? గువ్వలచెన్నా! |
11 |
| క. |
తెలిసియుఁ దెలియనివానికిఁ దెలుపంగలఁడే? మహోపదేశికుఁడైనన్ బలుకంబాఱనికాయము గొలుపంగలఁడెవఁడు మడ? గువ్వలచెన్నా! |
12 |
| క. |
చెలియలిభాగ్యము రాజ్యంబుల నేలుచు జనుల ద్వేషమునఁజూచుచుఁ గ న్నులమత్తతఁగొన్నాతఁడు కొలనికిగాపున్న వాఁడు గువ్వలచెన్నా! |
13 |
| క. |
అపరిమితవాహనాదిక మపూర్వముగనున్న యల్పుఁడధికుండగునా? విపులాంబరవాద్యంబులఁ గుపతియగునె గంగిరెద్దు? గువ్వలచెన్నా! |
14 |
| క. |
పందిరి మందిరమగునా? వందిజనంబాప్తమిత్రవర్గంబగునా? తుందిలుఁడు సుఖముఁగనునా? గొంది నృపతిమార్గమగున? గువ్వలచెన్నా! |
15 |
| క. |
మిత్రుని విపత్తునందుఁ గళత్రమును దరిద్రదశను భ్రాతలగుణము\న్ బాత్రాది విభక్తంబున గోత్రను గనుగొనఁగవలయు గువ్వలచెన్నా! |
16 |
| క. |
అంగీలు పచ్చడంబులు సంగతిఁగొనుశాలుజోడు సరిగంచులమేల్ రంగగు దుప్పటు లన్నియు గొంగళి సరిపోల వన్న! గువ్వలచెన్నా! |
17 |
| క. |
స్వాంతప్రవృత్తిఁ గార్యా నంతరమున మిత్రలక్షణంబు మద్యోహో గాంతరమున బంధుత్వముఁ గొంతైనంతటన చూడు గువ్వలచెన్నా! |
18 |
| క. |
పురుషుండు తటస్థించిన తరుణమునం దరుణిగునముఁ దరుణిదనంతన్ దొరికినఁ బురుషుని గుణమును గురుబుద్ధీ! తెలియవలయు గువ్వలచెన్నా! |
19 |
| క. |
కలిమిఁగల నాఁడె మనుజుఁడు విలసనమగు కీర్తిచేత వెలయఁగ వలెరా! గలిమెంత యెల్లకాలము కులగిరులా కదల కుండ? గువ్వలచెన్నా! |
20 |