| శతకములు | గువ్వలచెన్న శతకము |
|
| క. |
జనకుని గుణవిద్యలుగల తనుఁజుడు తనుజుండుగాక ధారుణిలోనన్ దనుఁజుడు దనుజుండగుఁ దద్గుణవిద్యలు లేకయున్న గువ్వలచెన్నా! |
61 |
| క. |
అక్కఱకగు చుట్టములకుమ్రొక్కఁగవలెఁగానిచూచి మూల్గెడువారల్ లెక్కిడుట కొఱకెయోర్వని కుక్కలు మేఁకమెడచళ్లు గువ్వలచెన్నా! |
62 |
| క. |
నిజవారకాంతలైనన్ బొజుఁగులలారఁగమరందభుజులనధములన్ గజిబిజిలేక గ్రహించుచు గుజగుజ బిట్ట కలరింత్రు గువ్వలచెన్నా! |
63 |
| క. |
ప్లీడరులమని వకిళ్ళీ వాడుకచెడ స్వేచ్ఛఁదిరిగి పాడుమొగములన్ గూడనివారింగూడుచుఁ గూడెముల జరింత్రుముందు గువ్వలచెన్నా! |
64 |
| క. |
ఇల్లాలబ్బెనటంచును దల్లింగని తిట్టికొట్టి తరిమెడితనుభృ త్తల్లజునకు భువిఁ గీర్తియు గుల్లలుగద దివిసుఖములు గువ్వలచెన్నా! |
65 |
| క. |
తలపరువు నోరె చెప్పును లలికాయలపండుపరువు రంగే చెప్పున్ కలవాజి జవమునడకయుఁ గులమును వేషంబు చెప్పు గువ్వలచెన్నా! |
66 |
| క. |
వేములఁ దినునలవాటును భామలగని వీడుటయును బరితోషమునన్ బాములమైత్రియునేర్చినఁ గోమటితోమైత్రివలయు గువ్వలచెన్నా! |
67 |
| క. |
ఇలఁగోమటి జెలికానిగఁ దలఁచుచు దద్ధితముగాఁగఁ దలనాల్కవలెన్ మెలఁగుట నేర్చిన గడుసగు కులకర్ణిని గూడవలయు గువ్వలచెన్నా! |
68 |
| క. |
తనహితవుఁ గోరుసతికల దనుకనె గృహనివసనంబు తగుఁ బురుషునకు\న్ దనుకడుపు శక్తికొలదిగ గొనవలయుఁ బదార్థములను గువ్వలచెన్నా! |
69 |
| క. |
తనతల్లియొక్కపరువును దన దగు నోరెప్రకటించుఁ దథ్యంబనియే సునృపులు ఘోషాఁబెట్టిరి గుణాదులన్యమగుచుననుచు గువ్వలచెన్నా! |
70 |