| శతకములు | గువ్వలచెన్న శతకము |
|
| క. |
చుట్టఱికముఁ చేసికొనన్ గట్టడిగాఁ దిరిగితిరిగి కార్యంబైనన్ మిట్టిపడుచు మాట్లాడఁడు గుట్టించునియోగివరుఁడు గువ్వలచెన్నా! |
71 |
| క. |
ఎంతధికారంబున్నను సంతతమును బరులయెడల సత్కులజాతుం డెంతయు నమ్రతఁ జూపును గొంతైనను మిడిసిపడఁడు గువ్వలచెన్నా! |
72 |
| క. |
వేషములచేతనొకటను భాషాపతికులులు మొదలు పదజులవఱకు\న్ శేషించి యొకఁడు నుండఁడు ఘోషాయును బోవుముందుగు గువ్వలచెన్నా! |
73 |
| క. |
సధవయు విధవయు నొకటిగ బుధులీక్షింపగనుంద్రు పొంకముమీఱన్ అధమంపువేషభాషలఁ గుధరములనఁ గదలకుంద్రు గువ్వలచెన్నా! |
74 |
| క. |
నీతియెఱుంగని నీచున కాతతరాజ్యము లభింప నధికుండగునా నాతివలెను నటియించునె కోతికి స్త్రీవేషమిడిన గువ్వలచెన్నా! |
75 |
| క. |
తక్కువ తరగతిగల నరుఁ డెక్కువ యగువానిఁగాంచి యేడ్చుచునుండున్ జక్కఁగఁ గరి వీథిం జన గుక్కలు గని మొఱుగకున్నె గువ్వలచెన్నా! |
76 |
| క. |
పరువునకొకటగు బంధూ త్కరమున ధనవంతునధికుగా నధనికుని\న్ గరమల్పునిగాఁ జూతురు గురినెన్న ధనంబు తిరమె? గువ్వలచెన్నా! |
77 |
| క. |
తొత్తునకే శివమెత్తఁగ నత్తఱి మ్రొక్కవలెననెడి నార్యోక్తివలెన్ దొత్తుకొడుకైన రాజును క్రొత్తగ సేవింపవలయు గువ్వలచెన్నా! |
78 |
| క. |
కంగాబుంగాగొట్టిన పొంగినమిరియాలనేతి మొదటిపిడుచతో మ్రింగిననాఁకలి నడఁచుటకుంగలనజ్జును హరించు గువ్వలచెన్నా! |
79 |
| క. |
సంగీతము నాట్యము గణికాంగనలవిగాని యవి కులాంగనలవియా? పొంగుచు వాద్యము ఱచ్చలకుం గొనిచని పాడఁగలరె? గువ్వలచెన్నా! |
80 |