శతకములు గువ్వలచెన్న శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. బుడ్డకు వెండ్రుకలున్న\న్‌ గడ్డముకానట్ల కార్యకరణుల సభల\న్‌
దొడ్డుగఁ జూతురె? తలపై గుడ్డలు బుట్టంత లున్న? గువ్వలచెన్నా!
21
క. వనజజకులులును శూద్రులు ననియెడి భేదంబు లేక యందఱు నొకరీ
తిని గొని యాచారాదుల గుణముల సరి నుంద్రుముందు గువ్వలచెన్నా!
22
క. కలుఁద్రావి నంజుడుం దిను ఖలుసుతుఁడు వకీలె యైన ఘనమర్యాదల్‌
తెలియవు బ్రాహ్మణుఁడైనను కులపాంసనుఁ డనఁగఁదగును గువ్వలచెన్నా!
23
క. వారిది వారిది ధనమొక కారణమున వచ్చిపడఁగఁ గన్నులుగన కె
వ్వారినిఁ దిరస్కరించును గోరెఁడు ధర్మంబు లేక గువ్వలచెన్నా!
24
క. ఇలుఁగలఁడె? పరివ్రాజకుఁ డెలమింగొనునెట్లు వేశ్య? యీనివిటునెడ\న్‌
గులకాంత విత్తమడుగునె? కొలఁదిఁ గలదె ఱంకులాడి గువ్వలచెన్నా!
25
క. ధన మతిగఁ గల్గి యున్నను దనయలుఁ దనయులును గల్గి తనరుచునున్నన్‌
ఘనలోభియు నిఱుపేదయు గుణముల సరియగుదు రెన్న గువ్వలచెన్నా!
26
క. చండాల కులుఁ డొసగిన తండులముల బ్రతికినట్టి ధాత్రీశకులుల్‌
నిండుతనం బెఱుఁగుదురే? కొండికలఁ జరింత్రు గాక గువ్వలచెన్నా!
27
క. సిరిఁగలిగినంత బంధూ త్కరములలో నెవరురారు ద్రవ్యాసూయా
పరతాశాపరులయి పదుగురు చూచి హసింతు రంచు గువ్వలచెన్నా!
28
క. సంపద గలిగిన మనుజుని కొంపకు బంధువులు కుప్పకుప్పలుగాఁగన్‌
సొంపుగ వత్తురు పేదకుఁ గుంపటు లన నుంద్రువారె గువ్వలచెన్నా!
29
క. నీచునకు ధనము గల్గిన వాచాలత గల్గి పరుషవాక్కు లఱచుచున్‌
నీచ కృతి యగుచు మది సంకోచము లేకుండఁదిరుగు గువ్వలచెన్నా!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - guvvalachenna shatakamu ( telugu andhra )