| శతకములు | గువ్వలచెన్న శతకము |
|
| క. |
జాలివిడిన చెలికానిని మాలనిగా నెన్నవలయు మఱియును బనికిన్ మాలినదై చెట్టెక్కెడి గోలాంగూలమనవలయు గువ్వలచెన్నా! |
81 |
| క. |
ముట్టంచు మాసమునకొక కట్టడిచేయఁబడె దాని కట్టుఁదెలియకే ర ట్టొనరింతురు గర్భపు గుట్టుం దెలియుటకుఁగాదె? గువ్వలచెన్నా! |
82 |
| క. |
ఆలికిఁ జనువిచ్చినచోఁ దేలికకులమందుదైనఁ దేలికచేయున్ లాలించిన కొలఁదిగ ననుకూలతఁ గొను నధికకులజ గువ్వలచెన్నా! |
83 |
| క. |
అవసరవిధిఁ బరువెఱుఁగని నివసనమున కరుగనగు ననేకావృత్తుల్ భువివిత్తముఁ గొనిపలుకని కువాక్కులు వకీళ్లెసాక్షి గువ్వలచెన్నా! |
84 |
| క. |
ధనవద్గర్వులు కొందఱు ఘనమనుచుం బంక్తిభేద కలితమ్ముగ భో జనముం గావింతు రటులఁ గొను టఘమందురు బుధాళి గువ్వలచెన్నా! |
85 |
| క. |
చెడుబుద్ధి పుట్టినపుడు సడిచేయక తనదుహృదయసాక్షి యెఱిఁగి నీ వుడుగుమిది తగదనుచు జనకుఁడువలెఁగృపఁ జెప్పుచుండు గువ్వలచెన్నా! |
86 |
| క. |
మేడయొకటి కలదనికడు వేడుకలంబడుచు విఱ్ఱవీగుచు నీచుం డాడకుఁ బరులెవ్వరు రాఁ గూడదనుచుఁ బల్కుచుండు గువ్వలచెన్నా! |
87 |
| క. |
లోభికి వ్యయంబు త్యాగికి లోభిత భీరునకు యుద్ధలోలత్వమ్మున్ వైభవము పతికి బ్రాణ క్షోభంబుగఁ దోఁచుచుండు గువ్వలచెన్నా! |
88 |
| క. |
సిరిగలుగ సుఖము గలుగును సిరిసంపదలున్న సుఖము చింత్యము భువిలోఁ దరువు చిగిర్చినగోమగు గురుతఁగొనదె కాయలున్న? గువ్వలచెన్నా! |
89 |
| క. |
తక్కువవానిని రమ్మని యెక్కువవానిఁగనొనర్ప నెంచినఁగాద మ్మక్కఁగ నందలముంచినఁ గుక్కాకున కుఱకకున్నె గువ్వలచెన్నా! |
90 |