| శతకములు | గువ్వలచెన్న శతకము |
|
| క. |
తెలుపైన మొగముగలదని తిలకము జుట్టును ద్యజించి తెల్లయిజారు\న్ దలటోపిఁగొనఁగ శ్వేతముఖులలో నొకఁడగునె ద్విజుఁడు గువ్వలచెన్నా! |
41 |
| క. |
వెల్లుల్లిఁ బెట్టి పొగిచిన పుల్లని గోంగూరరుచిని బొగడఁవశమా? మొల్లముగ నూనివేసుక కొల్లగ భుజియింపవలయు గువ్వలచెన్నా! |
42 |
| క. |
నీచున కధికారంబు బాచకునకు నాగ్రహంబుఁ బంకజముఖికి\న్ వాచాలత్వము బుధసంకోచముఁగడు బాధకములు గువ్వలచెన్నా! |
43 |
| క. |
దుడ్డన నెఱుఁగవి తలిపాటొడ్డుగఁగొను విద్యచే మహోద్యోగము తా నడ్డైనఁగనులకీఁగల గొడ్డువలెఁ జరించుచుండు గువ్వలచెన్నా! |
44 |
| క. |
బుడుతలు భోగంబులు సిరి యడరుకొలంది గనకార్యమందతిహితులై తొడరికడుఁ జెడుదు రిలపైఁ గుడియెడమలు లేకముందు గువ్వలచెన్నా! |
45 |
| క. |
కసకసలు కాయగూరల బుసబుసలగు ఱొంపనుండు బుడుతలయందున్ రుసరుసలు కోపియందును గుసగుసలు రహస్యమందు గువ్వలచెన్నా! |
46 |
| క. |
కరకర నమలుటయందును బరపరయగునెపుడు చుఱుకు వ్రాతలయందు\న్ జురచుర కాలుటయందును గొరకొరయగుఁ గోపదృష్టి గువ్వలచెన్నా! |
47 |
| క. |
కలిమిగల లోభికన్నను విలసితమగు పేదమేలు వితరణియైనన్ జెలమైన మేలుకాదా? కులనిధియంభోధికన్న గువ్వలచెన్నా! |
48 |
| క. |
విను మన్నీలశిఫార్సునఁ దనునమ్మినవానిపనులు ధ్వంసించువకీ ల్తనమున్నవాఁడు తిరిపెముఁ గొనునాతఁడు చల్లవాఁడు గువ్వలచెన్నా! |
49 |
| క. |
సజ్జనులు సేయునుపకృతి సజ్జను లెఱుఁగుదురుగాక సజ్జనదూష్యుల్ మజ్జనమునైన నెఱుఁగరు గుజ్జగు నంబలినిగాక గువ్వలచెన్నా! |
50 |