శతకములు గువ్వలచెన్న శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. అల్పునకు నెన్ని తెల్పినఁ బొల్పుగ నిల్వవవి పేడబొమ్మకు నెన్నో
శిల్పపుఁ బనులొనరించినఁ గోల్పోక యలారుచున్నె గువ్వలచెన్నా!
31
క. పిత్రాద్యైశ్వర్యముచేఁ బుత్త్రులుఁ బౌత్రులును ధర్మబుద్ధిఁ జరింతుర్‌
చిత్రగతి నడుమఁగల్గిన గోత్రంజిత్రగతిఁదిరుగు గువ్వలచెన్నా!
32
క. ధర నాఁడుపడుచు సిరిచే నిరతంబును బొట్ట నించి నీల్గెడుమనుజుం
డొరులెఱుఁగకుండ ఱాతో గురుతుగ నూఁతఁబడు టొప్పు గువ్వలచెన్నా!
33
క. గొల్లింటఁ గోమటింటను దల్లియుఁ దండ్రియు వసింప దానువకీలై
కళ్ళ మద మెక్కినతనికి గుళ్ళైనం గానరావు గువ్వలచెన్నా!
34
క. కాళం జేతులఁ జెమ్మట నీళ్లవలె స్రవించుచుండ నిరతము మదిలోఁ
గుళ్లక వకీలు నని తన గోళ్లం గొఱుకుకొను ద్విజుఁడు గువ్వలచెన్నా!
35
క. సవతితన మున్న చుట్టలు భువి నెఱసుగ నుండి సమయమున దూరంబై
నవుచుందురు రావేడినఁ గువచనములు పల్కుచుంద్రు గువ్వలచెన్నా!
36
క. తనవారి కెంతగల్గినఁ దనభాగ్యమె తనకు నగును దగువాజులకు\న్‌
దనతోఁకచేత వీఁచునె? గుణియైన\న్‌ ఘోటకంబు గువ్వలచెన్నా!
37
క. అతి చనువిచ్చి మెలంగఁగ సుతసతులైన నిరసించి చులకనచేతుర్‌
మతమెఱిఁగి చరింపందగుఁ గుతుకముతో మనుజుఁడెపుడు గువ్వలచెన్నా!
38
క. "చెన్న" యనుపదము మునుగల చెన్నగుపుర మొకటి దీనిచెంతను వెలయు\న్‌
సన్నుతులు వేల్పునుతులును గొన్నాతని కరుణచేత గువ్వలచెన్నా!
39
క. ధర నీపేరపురంబును గిరిజేశ్వర పాదభక్తి కీర్తియు నీయు
ర్వర నుతులుఁగాంతు విదియొక గురువరముగ నెంచుకొనుము గువ్వలచెన్నా!
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - guvvalachenna shatakamu ( telugu andhra )